కేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు
వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ.
ఆసిఫాబాద్ జిల్లా.
ఈ రోజు వాంకిడి మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మండల కాంగ్రెస్ నాయకులు బీసీ బందుకు మద్దతూ తెలపడం జరిగింది.
మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
బీసీ బందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది.మరియూ మండల వ్యాపారస్తులు బంద్ పాటించి బీసీ లకు సంపూర్ణ మద్దతుఇవ్వడం జరిగింది.
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియూ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేత్రుత్వంలో
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ఇవ్వడం కొరకు జీవో నెంబర్ 9 ను విడుదల చేసి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తుంటే కొందరు బీజేపీ బి ఆర్ ఎస్ కు చెందిన అగ్ర వర్ణ కుల ల నాయకులు బీసీ లను అనగా దొక్కలని చేస్తున్నారు.42 శాతం రిజర్వేషన్ ఇచ్చే, వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమం లో పలు బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పట్టణ యూత్ అధ్యక్షులు పాల్గొంటు బీసీ లకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది.





