*రామగుండం పోలీస్ కమీషనరేట్*
కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,
రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ….ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని సీపీ అన్నారు. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యబోధలను మనకు బోధించిన అమృత గ్రంథం. ఆయన బోధనలు సమాజంలో సత్యం, న్యాయం, సమానత్వం స్థాపనకు ప్రేరణగా నిలుస్తాయి. మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీ అన్నారు.
ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏ ఓ శ్రీనివాస్ ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సూపరిండెంట్స్ ఇంద్రసేనారెడ్డి, సందీప్ కుమార్, సిసి హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.





