42 Views

ముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) గ్రామ అభివృద్ధి కోసం చిగురునరేష్ అనే నేను స్వయ సహకారంతో బంధనకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజల సమస్యలతో పాటు పారిశుధ్యం డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. బంధనకల్ లో ఇదివరకే ఎన్నో నిధులు వచ్చినట్టే వచ్చి వెను తిరిగిపోయాయని వాటిని మళ్లీ తిరిగి రప్పించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మరోసారి బల్లగుద్ది చెబుతున్నానని నరేష్ తెలిపారు. బంధనకల్కు ఎందరో సర్పంచ్లు ఎన్నికై నారు నాక్కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నానని చిగురు నరేష్ కోరుతున్నారు. ఒక్క నిమిషం నా గురించి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు చిగురు నరేష్ సర్పంచిగా గెలిపిస్తే మన గ్రామ సేవకుడిలా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని పెన్షన్లు ఇండ్ల స్థలాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఇదే కాకుండా ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూలు రోడ్లు సోలార్ విద్యుత్తు ఇంకా అనేక సౌకర్యాలు అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామ ప్రజలకు ఉండాల్సినవే వాటి గురించి కూడా పోరాడుతానని రాబోయే కాలంలో బంధనకల్లో చెరువులే కాకుండా కాలువల సమస్యలు గ్రామ చావడి బతుకమ్మ ఘాటువద్ద ఎన్నో సమస్యలు తలెత్తాయి వాటిని అధిగమించి మరెన్నో పథకాలు అందేలా చూస్తానన్నారు. అదే కోవలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిచి సేవ కోసమే రాజకీయాలకు వచ్చానని ఈ అవకాశం నాకు మళ్ళీ రాకపోవచ్చు నా కుటుంబ సభ్యులారా మిమ్మల్ని ప్రాధేయపడి చేతులెత్తి మొక్కుతున్న నా గురించి ఆలోచించండి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి చిగురు నరేష్ ప్రాదేయబడి అడుగుతున్నారని తెలిపారు.
No Slide Found In Slider.
Poll not found