*రామగుండం పోలీస్ కమీషనరేట్*
విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు: షీ టీమ్ ఎస్ ఐ లావణ్య
మహిళలు, విద్యార్థుల భద్రతకు షీ టీం. ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని షీ టీమ్ ఎస్ ఐ లావణ్య తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదావరిఖని, గాంధీ నగర్ విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. షీ టీమ్ చేపడుతున్న భద్రత చర్యలను వివరించి, ఎవరైనా గురిచేస్తే ఇబ్బందులకు మొదట తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాత తమను సంప్రదించాలన్నారు. ఆపద సమయాల్లో డయల్ 100, అలాగే 6303023700కు ఫోన్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్లు పెరుగుతున్నాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయిన వారు వెంటనే 1980 నెంబర్ కు సమాచారం ఇస్తే వారు చర్యలు చేపడుతారన్నారు. మహిళల రక్షణకు షీటీం సభ్యులతో పలు రద్దీ ప్రాంతాలు, బస్టాండ్ల వద్ద నిఘా ఉంటుందని తెలిపారు. షీటీం సభ్యులు స్నేహ లత, మౌనిక, సురేష్ ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.





