ప్రాంతీయం

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా…

84 Views

సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రామసాగర్ సర్పంచ్ అభ్యర్థి నరేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధించినటువంటి మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు. 57 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ వచ్చే విధంగా, అర్హత కలిగినటువంటి దివంగులకు వికలాంగుల పెన్షన్ వచ్చే విధంగా పూర్తి బాధ్యత తీసుకుంటానని అన్నారు. గ్రామంలో ప్రతి వీధిలో సిసి రోడ్లు వేస్తాను, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఆడపడుచుల కోసం కుట్టు మిషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తాను. గ్రామంలో ఎవరైనా చనిపోతే కుల మతాలకు అతీతంగా రాజకీయ వివక్ష లేకుండా గ్రామపంచాయతీ నుండి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తాను, అలాగే ఒక ఫ్రీజర్ బాక్స్ ను ఏర్పాటు చేస్తాను. గ్రామంలో దొంగతనాలు జరగకుండా అన్ని వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతో అవసరం అన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు నిర్వహిస్తాను. గ్రామంలో ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాల గురించి గ్రామసభలో అందరికీ అవగాహన కల్పిస్తాను అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా సంపూర్ణంగా కృషి చేస్తాను. గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలు పునర్నిర్మాణం కోసం బాధ్యత తీసుకుంటాను. గ్రామంలో పారిశుధ్య నిర్మూలన మరియు పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తాను అని వారు అన్నారు. గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం క్రీడ సామాగ్రి మరియు ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేస్తాను. గంజాయి రహిత గ్రామంగా మన గ్రామాన్ని మారుస్తా అని తెలిపారు. మన గ్రామానికి బస్ స్టాండ్ వచ్చే విధంగా కృషి చేస్తా అని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *