– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 21: ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితబంధు పథకం కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. బోయినిపల్లి మండలానికి సంబంధించి లబ్దిదారులతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని సూచించారు. యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులకు అవగాహన సమావేశాలు నిర్వహించే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. వివిధ యూనిట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులు లబ్ధిదారులకు అవగాహన, శిక్షణకు చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని విధాలా సహకరించాలని అన్నారు. చేపల చెరువుల పెంపకం కోసం జిల్లాలో 47 మంది నుండి దరఖాస్తులు రాగా, అందులో 18 దరఖాస్తులను , ఫిషరీస్, నీటిపారుదల, వ్యవసాయ, భూగర్భ జల శాఖ అధికారులతో క్షేత్ర స్థాయి తనిఖీలు చేయగా, 17 దరఖాస్తులను ఆమోదించినట్లు, ఒకటి తిరస్కరించడం జరిగిందని తెలిపారు. మిగతా దరఖాస్తులు త్వరితగతిన సంబంధిత శాఖలతో జాయింట్ తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, డీఆర్డీఓ కె. కౌటిల్య, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి నర్సింహులు, ఆర్టీఓ కొండల్ రావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రణధీర్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
