ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్2, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టపాసులు పేల్చి దశాబ్దిఉత్సవాలు ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను ఛేదించిన ఘనత సీఎంకేసీఆర్ నాయకత్వంలో అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకున్నాము. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ కేవలం తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించుకుంటున్న దిశగా వినూత్న పథకాలతో దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచింది సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు జరిగిన అభివృద్ధిపై సమగ్ర సమాచారం తెలంగాణ రాష్ట్ర పదేళ్ల ప్రగతి ఉన్నతమైన ప్రస్థానానికి చేరిందఅన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పలుగ్రామాల్లో జెండాలు ఆవిష్కరించి జెండా వందనం చేసి జాతీయ గీతం ఆలపించారు. ఈకార్యక్రమంలో వివిధ హోదాలు గలవారు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
