ప్రాంతీయం

విద్యార్థినికి ఎమ్మెన్నార్ ఆర్థిక సహాయం

131 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి అనూష జిఎన్ఎమ్ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి కి ఫోన్ ద్వారా తెలుపగా వెంటనే విద్యార్థినికి రూ.5 వేలు ట్రస్ట్ సభ్యులు పోతరాజు రవీందర్, వేంపల్లి శ్రీనివాస్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి మద్దుల నాగేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు. విద్యార్థిని అనూషకు ఎమ్మెన్నార్ ట్రస్ట్ అండగా ఉంటుందని, పై చదువుల కోసం మిగతా ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, సత్తయ్య, భూమవ్వ, రాజేందర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7