ప్రాంతీయం

నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సి పి

39 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్.

ప్రజల భద్రతలో భాగంగా ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా QRT టీమ్ ల ఏర్పాటు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కి ఎంపిక కాబడిన నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ లకు రామగుండం కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఐజి హాజరై సిబ్బంది యొక్క స్కాడ్ డ్రిల్, పరేడ్, మాబ్ ఆపరేషన్ డ్రిల్, స్పెషల్ పార్టీ విధులు, కుంబింగ్ విధులు మరియు వివిధ బందోబస్త్ లలో రోప్ పార్టీ విధులు మరియు వారు చేయవలసిన విధులు, చేయకూడని విధుల గురించి, అత్యవసర పరిస్థితులలో పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను గురించి పలు సూచనలు సిబ్బంది కి సీపీ  ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ … కమీషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యం గా విధులు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. శాంతి భద్రతల సంరక్షణకు, అత్యవసర పరిస్థితి లలో అనుగుణంగా QRT, స్పెషల్ పార్టీ సిబ్బంది కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నారు( QRT) బలగాలను విస్తృతంగా వినియోగించి లా&ఆర్డర్ నిర్వహించడంలో, ఏదైనా నిరసనలకు వెంటనే స్పందించడంలో, మరియు ఈ కీలక సమయంలో పౌరుల భద్రతను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. కమీషనరేట్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు సంభవిస్తే వెంటనే స్పందించేందుకు QRT బృందాలు వ్యూహాత్మకంగా నివారించడానికి విధులు నిర్వహిస్తాయన్నారు .

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, సంపత్, ఆర్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్