మంచిర్యాల జిల్లా.
బీసీ వసతి గృహంలో నిద్ర చేసిన కుమార్ దీపక్ జిల్లా కలెక్టర్.
మంచిర్యాల పట్టణంలోని సాయికుంటా లో ఉన్న బిసి వసతి గృహాన్ని శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ని వంట గదిని పరిశీలించి రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి బీసీ వసతి గృహంలో నిద్ర చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం మరియు తదితరులు పాల్గొన్నారు.
