శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు
5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం
పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్
:
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు,
అనంతరం బోనాల చుట్టు మహిళా గావ్ చేశారు,
అనంతరం పుట్టబంగారం , బియ్యం సుంకిచ్చే కార్యక్రామాలను నిర్వహించి 11 మేకల గావు పట్టారు,
శ్రీ దుర్గా మాత గిద్ద చెరువు కట్ట మైసమ్మల ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గ్రామంలో పిల్లా పాపలు పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తన స్వంత ఖర్చులతో ఎల్లారెడ్డిపేట గ్రామంలోని గ్రామదేవతలకు ఎన్నడూలేని విధంగా బోనాల రాజేశ్ కళాబృందంచే పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు వివిధ వేషధారణ కళాకారుల తో పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు డిజీయో సౌండ్ సిస్టం పాటలతో గ్రామ ప్రజలను శోభాయాత్ర రాత్రి వరకు సాగింది విశేషంగా ఆకట్టుకుంది, మేకల బలి దానాలు చేశారు, ఎల్లారెడ్డిపేట గ్రామంలోని వివిధ కుల సంఘాల వారికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు సుమారు 5000 మందికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం శాఖాహారం, మాంసహారాలతో అన్నదానం చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు,
దుబ్బుల కళాకారులు యాదగిరి, శ్రీనివాస్, దేవరాజ్ బాలయ్య, రాజయ్య, శ్రీనివాస్ మహేష్ , దేవరాజు, సాయి , నర్సింలు బృందం శ్రీ దుర్గా మాత వద్ద నిర్వహించిన కార్యక్రమాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎంతో ఆసక్తిగా తిలకించారు,
ఆదివారం శ్రీ దుర్గా మాత ను , గిద్ద చెరువు కట్ట మైసమ్మ లను బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, స్థానిక సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మమతా వెంకట్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,. ఆలయ కమిటీ సభ్యులు నందికిషన్, సద్ది లక్ష్మారెడ్డి రావుల ముత్యం రెడ్డి , లింగారెడ్డి , ఎల్లారెడ్డి , మల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామంలోని వివిధ కులాల ప్రజలు తదితరులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు,
బోనాల శోభాయాత్ర కు సహాకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు*
సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ దుర్గా మాత, గిద్ద చెరువు కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో , బోనాల శోభాయాత్రలో పాల్గొని సహకరించిన వివిధ కుల సంఘాల ప్రజలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నీవూరి వెంకట్ రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు,



