సెప్టెంబర్ 26
సిద్దిపేట జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ అధ్యక్షతన నియంతృత్వ, నిరంకుశ దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ 128వ జయంతి .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జిలు కెతోజి వినోద్ చారి మరియు కొండనోళ్ళ నరేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దున్నే వాడిదే భూమి అంటూ నినాదించి, అరక చేతబట్టి నియంత దొరల భూములను దున్ని సాగు చేసి పంట పండించి ఆ పంటను శ్రామిక ప్రజలకు పంచిన తెలంగాణ దీరవనిత అని, అటువంటి బహుజనయోధురాలు చాకలి ఐలమ్మ స్పూర్తితో బహుజనులు అందరూ ఏకమై బహుజన రాజ్యాధికార దిశ గా పయనించాలన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఈసీ సభ్యులు ఆశని కనక ప్రసాద్,పెంటకడి సుధాకర్, ప్రసాద్,ప్రశాంత్,శ్రవణ్ పలువురు నాయకులు పాల్గొన్నారు
