బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక.
మంచిర్యాల జిల్లా.
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్ర, రాష్ట్ర నాయకులు దయానంద్, కాదాసీ రవీందర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబుని ఎంపిక చేయడం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ పార్టీ నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని మరియు మాయావతి ఆశయాలను ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా మరియు కాన్షీరామ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీకి విధేయుడిగ పనిచేస్తానని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, దాగం శ్రీనివాస్, గాజుల శంకర్, కృష్ణ మరియు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.





