చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలి.
మంచిర్యాల జిల్లా.
రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే 79 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు పాలించబడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నాం. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టలేదు అని బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న 85 కోట్ల మంది బీసీ ల కు బీసీలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బీసీలకు కావాల్సిన ప్రజాస్వామ్య వాట ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, నాయకులు శాఖపురి భీమ్సేన్, చంద్రగిరి చంద్రమౌళి, చెలిమెల అంజయ్య మరియు అంకం సతీష్ పాల్గొన్నారు.





