మంచిర్యాలలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా తీసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా.
మద్యం దుకాణాల గడువు ముగియడంతో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాల దరఖాస్తు డ్రా కార్యక్రమాన్ని ఈరోజు శ్రీరాంపూర్ లోని పోలీస్ స్టేషన్ పక్కన సివిఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసింది.
2025 — 27 సంవత్సరానికి గాను కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రాకు సంబంధించి మంచిర్యాల ఏరియా శ్రీరాంపూర్ లో ని పోలీస్ స్టేషన్ పక్కన పివిఆర్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా తీయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి నందగోపాల్, ఎక్సైజ్ సీఐ గురువయ్య, ఎస్ఐలు, మరియు ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





