ఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్.
మంచిర్యాల జిల్లా.
నూతన మద్యం పాలసీ విధానం 2025- 27 లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల పి. వి. ఆర్. గార్డెన్స్ లో ఎ4 మద్యం దుకాణాలకు కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు/ అదికృత వ్యక్తులు సకాలంలో కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.





