మంచిర్యాలలో ఎసిబి వలలో చిక్కిన జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలో ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి తిమింగలం జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శనివారం పట్టుపడ్డాడు. సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేయడం విషయంలో 7 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయగా మొదట విడత కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పి మధు తెలిపారు.
బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తు ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు ఆయనను రంగే హస్తంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ సహకార అధికారి కార్యాలయం లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.





