దౌల్తాబాద్ : రోటోవేటర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుప్పతి దుర్గయ్య (38) గ్రామ శివారులో సోమవారం సాయంత్రం పొలం దున్నుతున్న ట్రాక్టర్ రోటో వేటర్ కింద పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
