ప్రాంతీయం

పి ఆర్ టీయూ సభ్యత్వ సేకరణ

82 Views

దౌల్తాబాద్: దుబ్బాక పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, చేర్వాపూర్ ప్రాథమిక పాఠశాల, లచ్చపేట ఆదర్శ పాఠశాల, ఉన్నత , ప్రాథమిక పాఠశాల లో పి ఆర్ టి యు టి ఎస్ దుబ్బాక అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ సేకరణ పిఆర్టియుటిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మల్లు గారి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 5 వరకు ఉపాధ్యాయులందరి బదిలీలు, పదోన్నతులు పూర్తవుతాయని త్వరలోనే పిఆర్సి కమిటీ వేసి మధ్యంతర భృతి కూడా ప్రకటించడం జరుగుతుందని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక అర్బన్ అధ్యక్షుడు గాజుల రామచంద్రం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అనిల్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జనార్ధన చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *