ప్రాంతీయం

విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం

96 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం జూలై 25: కోనరావుపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడి ఆవరణం కొనరావుపేట్ ఈరోజు 12 గంటలకు జరిగినది ఈ సమావేశానికి మండల అధ్యక్షులు సంకోజి సత్తయ్య అధ్యక్షతన ఈ సమావేశానికి ముఖ్య అతిథి
జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్  మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల హక్కుల సాధనకై చలో సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరారు మరియు ప్రభుత్వం 250 కోట్లు రూపాయలు ఇస్తామని విశ్వకర్మలను మోసం చేసింది ప్రస్తుతం బీసీలకు లక్ష రూపాయల లోను పథకం పేరిట మొక్కుబడిగా ప్రారంభించేసి పూర్తి న్యాయం చేయలేక పోయింది విశ్వకర్మ ల కార్పొరేషన్ లక్ష్యంగా పోరాడవలసిన అవసరం ఉంది నిరసనగా చలో సిరిసిల్ల కార్యక్రమం లో ప్రతి విశ్వకర్మ పాల్గొనాలని అన్నారు మండల సంఘం కార్యాలయం గురించి భవన నిర్మాణ భూమి కొనుగోలు కొరకై సమిష్టిగా ఉండి సాధించుకోవాలని అన్నారు మూడు నెలలు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని కోరారు
ఇట్టి కార్యక్రమంలో
కార్యదర్శి యశోద వేణు  జిల్లా కార్యవర్గ సభ్యుడు వంగల రవి  కొనరావుపేట ఎంపీటీసీ దేవరకొండ నరసింహ చారి  జిల్లా ప్రచార కార్యదర్శి కోడిముంజ రాజు  ఉపాధ్యక్షుడు దర్శనాల వెంకటస్వామి  కోశాధికారి కోడిముంజ ఆంజనేయులు వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు స్తంభం పెళ్లి చారి  బూరుగుపల్లి రాజేందర్ శ్రీనివాస్ శ్రీను దశరథం రాజేశం రామస్వామి నాగేందర్ అన్వేష్ తిరుపతి శ్రీను వెంకటేష్ రాజు లక్ష్మణ్
మండల నాయకులు తదితరులు విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *