పదవి విరమణ చేసిన పోలీసు అధికారులకు కమిషనర్ కార్యాలయంలో వీడ్కోల కార్యక్రమం
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 31( తెలుగు న్యూస్ 24/7 )
సిద్దిపేట్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు. నడింపల్లి వెంకట రామకృష్ణ రాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ( ఏఎస్ఐ), రైపోల్ పోలీస్ స్టేషన్ , ఉద్యోగ ప్రస్థానం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు అంచలంచలుగా పదవోన్నతి పొంది పనిచేయడం జరిగింది. కాసుల ఉమా రెడ్డి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ( ఏఎస్ఐ), గజ్వేల్ పోలీస్ స్టేషన్,ఉద్యోగ ప్రస్థానం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు అంచలంచలుగా పదవోన్నతి పొంది ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేటలో పనిచేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ఐ,పిఎస్ ఆదేశానుసారం అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, బుధవారం పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను అభినందించి సన్మాన పత్రం మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సర్వస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయడం జరుగుతుంది. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేస్తు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు. సిద్దిపేట పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించవచ్చని అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





