దౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి సహకార సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నిర్మాణం జరిగే స్థలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను షిఫ్ట్ చేసేందుకు కృషి చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు స్టీవెన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గుప్త, డైరెక్టర్లు రమేష్, సత్యనారాయణ, మల్లేషం, ఆంజనేయులు, సర్వన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బా అశోక్ గుప్తా, బ్రాంచ్ మేనేజర్ మొయినుద్దీన్, సూపర్‌వైజర్ రాజేంద్ర, సీఈఓ మల్లేషం, వార్డు మెంబర్లు నరేష్ గుప్తా, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




