*మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత*
*మంచిర్యాల బెల్లంపెల్లి ల నుండి కాంగ్రెస్, తెరాస ల నుండి బీఎస్పీ లో భారీగా చేరికలు*
*కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం *
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా లోని అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ రోజు నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి ఫారం లు అందచేశారు. ఈ కార్యక్రమం కి బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం హాజరై అభ్యర్థులనుద్దేశించి విధి విధానాలు చెప్పి అందరికి బి ఫారం లు అందచేసారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు
విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తెరాస బీజేపీ లు బహుజనుల వ్యతిరేక పార్టీ లు అని అన్నారు. బీసీ లకు 42 %రిజర్వేషన్ లు ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాజ్యాంగం ను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని వీడి సిట్టింగ్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొద్దున సంధ్యారాణి – రామ్మూర్తి గార్లు, తెరాస నుండి ఇప్ప సురేష్, క్యాతన్ పల్లి నుండి బొల్లి రమేష్, లక్షేట్ పేట్ నుండి రామిళ్ల మురళీ, లు బీఎస్పీ లో చేరగా నిషాని రామచంద్రం కండువా కప్పి బీఎస్పీ లోకి ఆహ్వానించినారు. అనంతరం వారికి బి ఫారం అందచేశారు. బెల్లంపల్లి నుండి కూడా చాలా మంది బీఎస్పీ లో చేరినారు. ఈ కార్యక్రమం లో జోన్ ఇంచార్జ్ కాదసి రవీందర్, జిల్లా ఇంచార్జ్ లు నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీ ల నుండి పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.





