ప్రాంతీయం

రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత

108 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు టార్పాలిన్ కవర్లు ఫౌండేషన్ సభ్యులు గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఒక ఎకరా లోపు భూమి ఉన్న 30 మంది రైతులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లు అందజేయడం జరిగిందని అన్నారు. ఉచితంగా కవర్లను అందజేసిన ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం, బోటుక లక్ష్మణ్, సాయిబాబా, సతీష్, నరేందర్, తిరుపతి, దుర్గయ్య, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh