*రామగుండం పోలీస్ కమీషనరేట్*
హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ .
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.
ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ హాజిపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది తో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్లు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్‌ఎస్ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ కి సమాచారం సెట్ ద్వారా గురించి రిసెప్షన్ సిబ్బంది తో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్ కి మాట్లాడించడం జరిగింది. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితిల గురించి, ముఖ్యమైన ప్రాజెక్టు లు గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…. విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై ప్రజల లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి సమస్య వినాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తనిఖీల అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్.ఐ స్వరూప్ రాజ్ పాల్గొన్నారు.





