సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రాంసాగర్‌లో ఇటీవల సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా తరగతి గదులలో ఉన్న ఫ్యాన్లు దెబ్బతిన్నాయి అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆది రెడ్డి, కొండారి రమేష్ కి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఒక్కొక్కరూ ఒక ఫ్యాన్ చొప్పున పాఠశాలకు అందజేశారు. వారి దాతృత్వానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే పిలుపు అందుకున్న వెంటనే ఫ్యాన్ల ఇన్‌స్టాలేషన్ పనులను స్వచ్ఛందంగా నిర్వహించిన సత్యం, రవి కి కూడా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.





