ప్రాంతీయం

మానవుడి అవసరాల్ని తీర్చే సహజ వనరులలైన మృత్తికలను (నేలను)కాపాడుకుందాం..

124 Views

ఈరోజు గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో ప్రపంచ మృత్తిక (నేల)దినోత్సవం సందర్భంగా రైతువేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ జడ్పీటిసి మల్లేశం ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి తో కలిసి మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో మృత్తికలు ముఖ్యమైనవని అన్నారు. భూ ఉపరితలంలోని సారవంతమైన భూమిని మనం కాపాడుకోవాలి అన్నారు. వ్యవసాయాభివృద్ధిలో నెలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఐదు వేల ఎకరాలకి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతులు అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా రైతువేధికాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందుకనుగుణంగా ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని కూడా సలహాలు సూచనలు చేయడానికి వారిని నియమించారన్నారు..ప్రభుత్వం అనేక రకాలుగా రైతులకు సంక్షేమం పథకాలు తీసుకొచ్చిన విషయాన్ని వారు తెలిపారు.వృక్షసంపద, పంటల ఉత్పత్తికీ సకల ప్రాణుల జీవనానికి మృత్తికలు దోహదపడుతయాని అన్నారు.
మానవాళి మనుగడలో ‘నేల’ పాత్ర అత్యంత కీలకము అని వారు అన్నారు. మృత్తికలు మనుషులు, పశు పక్ష్యాదుల జీవనానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తుందని సారవంతమైన నేలలు అధిక ఆహార ఉత్పత్తులకు దోహదపడతాయని అన్నారు.
ఈరోజు వివిధ కారణాల వల్ల నేలలు మనిషి చేసే పొరపాటు వలన దెబ్బతింటున్నాయని అన్నారు.నేలలను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని అన్నారు..రైతులు రసాయనిక ఎరువులను ఉపయోగించకుండ సహజ సిద్ధమైన కృత్రిమ ఎరువులని ఎక్కువగా వాడాలని దీని వలన భూ కాలుష్యం తగ్గి దెబ్బతినకుండా ఉంటుందని అన్నారు. రసాయన ఎరువులు వేయడం వలన భూమిలో లవణాల శాతం తగ్గి ఎడారిగా మారె ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూన్నరని అన్నారు. రైతులు ఎప్పుడు ఒకే రకం పంటలు పండించడం మానేసి పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచించారు. పప్పు దినుసులు, చిరుదాన్యలు, నూనె గింజలు వాణిజ్య పంటల వైపు ఆలోచన చేయాలని దీనివల్ల పెట్టుబడులు తగ్గి సులువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చని అధిక లాభాలు కూడా పొందొచ్చని అన్నారు..తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో రైతులకు విత్తనాలు అందచేయడం జరుగుతుందని పండించిన పంటలకు మద్దతుదరులు కలిపిస్తున్నట్లు వారు తెలిపారు..
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు భూసార పరీక్షలు చేయడానికి గాను భూసార పరీక్ష కేంద్రం త్వరలోనే ఏర్పాటుచేసుకోబోతున్నామని వారు అన్నారు..ఈ కార్యక్రమంలో ada బాబు నాయక్, ao నాగరాజు, సర్పంచ్ శిల్ప అశోక్, ఎంపీటీసీ రాజేశ్వరి కిష్టయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాస్కర్ రెడ్డి, తెరాస నాయకులు పిట్ల రాములు రైటిబందు సభ్యులు, తెరాస నాయకులు రైతులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel