ముస్తాబాద్, జనవరి 31 (24/7న్యూస్ ప్రతినిధి): మద్దికుంట గ్రామంలో ఐదు సంవత్సరాల పదవికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో మద్దికుంట పాలక వర్గాన్ని సన్మానించడం సాల్వాతో సన్మానించి మెమొంటోళ్లు అందజేశారు. ఇందులో భాగంగా జిపి కార్మికులకు కొత్త బట్టలు పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యశ్రీ, ఉప సర్పంచ్ కదిరి భూమయ్య, వార్డుసభ్యులు కార్యదర్శి, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
