బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించడం తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు తో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలోసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
రోడ్డు ఫై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట అగయ్య తో పాటు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, చీటి నర్సింగరావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, సత్తర్,మురళి,దార్ల సందీప్, శ్రీనివాస్, చిన్న, మనోజ్, వరుణ్, మహిళ నాయకురాళ్ళు ,బారీగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





