సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు వై వీ నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రాత్రి ముగిశాయి దాదాపు వంద జట్లు పాల్గొన్నాయి రెండు రోజులు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతలకు ఎఫ్ ఎఫ్ యు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని క్రీడల ద్వార మానసిక ఉల్లాసం తో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని ఆత్మ విశ్వాసం పెరుగుతుందని క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని క్రీడా స్పూర్తి తో మెలగాలని, కీర్తి శేషులు నాగచైతన్య గజ్వేల్ ప్రాంతంలో వాలీబాల్ క్రీడల్లో మంచి గుర్తింపు పొంది రాష్ట్ర జాతీయ స్థాయి లో ఆడి యువతకు ఆదర్శంగా నిలిచారు అని వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ చక్కని కార్యక్రమం నిర్వహించిన గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు, మొదటి బహుమతి 20,000 రూపాయలు తెరాస యువ నాయకులు ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన అధ్యక్షులు నేతి చిన సంతోష్ సౌజన్యంతో,రెండవ బహుమతి 10, 000 సయ్యద్ మతీన్ సౌజన్యంతో, తృతీయ బహుమతి( 5,000) 12 వ వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ సౌజన్యంతో, ట్రోఫీలు, మెమెంటో లు 17 వ వార్డ్ తెరాస అధ్యక్షుడు భాను ప్రసాద్ సౌజన్యంతో అందజేయడం జరిగిందని గజ్వేల్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు తెలిపారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వాలీబాల్ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి,నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, కొమరవెళ్ళి ప్రవీణ్, కన్న యాదవ్,హరి చంద్ర ప్రసాద్,రఘుపతి,వెంకటేశ్,గోవర్ధన్,సంతోష్,కనకయ్య, అరుణ్,ఆంజనేయులు,చంద్రం, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




