
ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసిన సర్పంచ్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బండలిగంపల్లి గ్రామానికి రెండవ విడత లో ప్రస్తుతం ఐదు ఇళ్ళు మంజూరు అయ్యాయని మరో పన్నెండు ఇళ్ళు మంజూరు కానున్నాయని లబ్ధిదారులు త్వరగా ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని కోరారు.ఇంకా నిరుపేదలు ఎవరైనా ఇళ్ళు కట్టుకోవాలను కునేవారు అధైర్య పడవద్దని విడతల వారిగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు చేయడానికి కృషి చేస్తామని అన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు సర్పంచ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ప్రభుత్వానికి, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,లబ్ధిదారులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.





