క్రీడలు

ఆసియా గేమ్స్‌లో మెరిసిన తెలంగాణ బిడ్డ

269 Views

సెప్టెంబర్ 27 తెలుగు న్యూస్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు.

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించి, టీమ్ స్పిరిట్‌ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలుచేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రానున్న రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం ఆకాంక్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *