ఎర్రవల్లి / మర్కుక్ మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 23)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గత 15 రోజులుగా ఎర్రవల్లి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఎర్రవల్లి / మర్కుక్ మధ్య ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది.మర్కుక్ జట్టు విజేతగా, ఎర్రవల్లి జట్టు రన్నరప్ గా నిలిచాయి.అనంతరం
విజేతలకు మొదటి బహుమతి 11 వేల రూపాయలు లెజెండ్
యూత్ అసోసియేషన్ వారు అందజేశారు.రెండవ బహుమతి 5వేల రూపాయలు ప్యాక్స్(జగదేవపూర్) వైస్ చైర్మన్ బాలరాజు అందజేశారు.ఇరుజట్లకు బహుమతులను గజ్వేల్ బార్ అసోసియేషన్ చైర్మన్,రోటరీ క్లబ్ గజ్వేల్ శాఖ అధ్యక్షులు చెన్ రాజ్ పాండరి ఆర్థిక సహకారంతో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ, మర్కుక్ సీనియర్ ప్లేయర్ సంతోష్, లెజెండ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చెన్ రాజ్ కృష్ణ, మాట్లాడుతూ
ఈ టోర్నమెంట్ ని ఇంతటి ఘన విజయం చేసిన
కమ్మరి బాలరాజు,చెన్ రాజ్ పండరి లెజండ్ యూత్ అసోసియేషన్ సభ్యులకు,టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని గ్రామాల క్రికెట్ టీంలకు, క్రికెట్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
