ప్రాంతీయం

నామినేషన్ దాఖలు చేసిన కొండల్ రెడ్డి 

233 Views

అంగడి కిష్టాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండల్ రెడ్డి

సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 27

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ యువ నాయకుడు తాజా మాజీ ఉపసర్పంచ్ కొండల్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి గా తన నామినేషన్ దాఖలు చేశారు, వారితో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ మాట్లాడుతూ, అంగడి కిష్టాపూర్ గ్రామ సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన కొండల్ రెడ్డి యువకుడు విద్యావంతుడు గుణవంతుడు సహనశీలి సేవ తత్పరుడు బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొండల్ రెడ్డి సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా జనరల్ సీటు రాకపోవడం వల్ల సర్పంచ్ గా బరిలో నిలువకపోవడం జరిగిందని గతంలో బీసీ అభ్యర్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించిన కొండల్ రెడ్డి ఇప్పుడు జనరల్ సీటు వచ్చిన కారణంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని తనకు గ్రామం లో ఎక్కువ శాతం ప్రజల సహకారం ఉందని కచ్చితంగా కొండల్ రెడ్డి విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్