శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మండలంలో రాయపోల్, వడ్డేపల్లి పలు గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో జన్మించాడు. చిన్న వయస్సు నుండి చిలిపి పనులు చేస్తూ వెన్నె దొంగ, గోపికల మనస్సు దోచి గోవర్ధన పర్వతాన్ని చిటికాన వేళ్ళు పై లేపి, పాండవులకు, కౌరావులకు యుద్ధంలో పాండవుల వెనుక ఉండి గెలిపించిన శ్రీష్ణుడు అలాంటి దేవుడుని జన్మదిన వేడుకల సందర్భంగా చిన్నారులను కృష్ణుడు, రాధ, గోపికల వేశాధారణలో అలరించారు.
