మంచిర్యాల జిల్లా.
చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలో ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ అశోక్ పాల్గొని వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేశారుపొక్రాన్ అను పరీక్షలను వాజ్పేయి కాలంలోనే విజయవంతంగా నిర్వహించారు అలాగే భారత దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలని అటల్ బిహారీ వాజ్పేయి గ్రామీణ సడక్ యోజన ద్వారా దేశంలో ఉన్న అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేసినారు మన దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఎన్నో గౌరవ పురస్కారాలలో1992లో పద్మవిభూషణ్ మరియు 2017లో భారతరత్న పురస్కాలతో సత్కరించారు ఈయన కాలంలోనే పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధం విజయవంతంగా పూర్తి చేశారు అదేవిధంగా పాకిస్తాన్ భారతదేశం రెండు స్నేహపూర్వకంగా ఉండాలని లాహోర్ బస్సు యాత్ర అని ప్రారంభించారు ఆయనకు అజాతశత్రువు అనే పేరు ఉండేది ప్రతిపక్షాల్లో ఉన్న సభ్యులు కూడా ఈనని అభినందించాడు వారు ఈయన అందరితో కలివిడిగా ఉండడం వల్ల ఆయనకు ఆ బిరుదు వచ్చింది నేటి యువత ఆయన యొక్క జీవితాల్లోని సందర్భాలను స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చప్పిడి నరేష్ సీనియర్ నాయకులు, డివి దీక్షితులు సీనియర్ నాయకులు, మల్యాల రాజమల్లు, శనిగారపు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వినయ్ గారు పాల్గొన్నారు.
