Breaking News

అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి

17 Views

రాబోయే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

విద్యుత్ పున:రుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా కార్యాచరణ

24×7 అత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండాలి

కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 ఏర్పాటు

ఆకస్మిక వరదల సమయంలో ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లో సిద్ధం చేసుకోవాలి

అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9398684240 ఏర్పాటు

వరద పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలకు సెలవు మంజూరు పై నిర్ణయం

భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం

అతి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని , రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యల పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాన్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పాల్గొన్నారు.

*సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,* హైదరాబాద్ ప్రాంతంలో అధికంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇంచార్జి మంత్రి వర్యులు రెవెన్యూ, పోలీసు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలో వర్షాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలని అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్. ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని, ఆకస్మిక వరదల సమయంలో ప్రజల ప్రాణాల రక్షణకు ఏర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం ఖమ్మంలో మనకు ఎదురైన ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

వరద సహాయక చర్యలకు కలెక్టర్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అక్కడ వారికి అవసరమైన వైద్యం ఆహారం ఇతర ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఖమ్మం ,రామగుండం, కరీంనగర్, వరంగల్ వంటి కార్పొరేషన్ ప్రాంతాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి 24×7 మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. కార్పొరేషన్ ప్రాంతాలలో ముందుగానే అవసరమైన బృందాలను సిద్ధంగా పెట్టుకోవాలని అన్నారు.

వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్, ఇతర పరికరాలు ఫీల్డ్ లో సిద్ధం పెట్టుకోవాలని, విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లు సన్నద్ధం చేయాలని, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు.

వరదల గురించి ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో, ఎఫ్.ఎం రేడియో , వివిధ మాధ్యమాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. ఐటీ సంస్థలతో మాట్లాడి వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం జారీ చేసేలా చూడాలని, రోడ్డు పైకి ప్రజలు అనవసరంగా రావద్దని అన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని విద్యా సంస్థలతో చర్చించి సంబంధిత శాఖ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం తెలిపారు.

హైడ్రా, జిహెచ్ఎంసి ,మెట్రో వాటర్ సర్వీస్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అన్నారు. ఫ్లై ఓవర్ పై నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, పంప్ ల ద్వారా నీటిని డ్రైనేజి కు తరలించాలని సీఎం అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు మరణించే పశువులకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకపోవడం వల్ల సహాయం చేయలేకపోతున్నామని, పోలీసు అధికారులకు సమాచారం అందించి వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అన్నారు. వరదల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అన్నారు.

ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనల పై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు.

భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద సాధ్యమైన మేర విద్యుత్ ఉత్పత్తి చేయాలని అన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నింపుకోవాలని, వస్తున్న వరదను అంచనా వేస్తూ అవసరమైన మేర నీరు దిగువకు విడుదల చేయాలని అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, గ్రామాలలో భారీ వర్షాల వల్ల చెరువులు తెగి పోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా చేయక పోయినప్పటికీ బఫర్ స్టాక్ తో రైతులకు సర్దుబాటు చేశామని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియాను రైతులకు సరిపడా సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. యూరియా అక్రమ రవాణా జరక్కుండా జిల్లాలలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూసి నది ఉధృతంగా పాడుతూనే నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వరదలు అనే పద్యంలో కనెక్టివిటీ దెబ్బ తినకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో వరదల నియంత్రణ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే మూడు రోజులలో 24 జిల్లాల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు.

రాష్ట్రంలో ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని అన్నారు.

సమావేశానంతరం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9398684240 ఏర్పాటు చేసి పోలీస్ రెవెన్యూ ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు 24/7 అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ అధికారులు,ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలనీ పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *