ముస్తాబాద్ (ప్రతినిధి) డిసెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంచర్ల రవిగౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల పాండు మాట్లాడుతూ ఆరోజు అమరుడైన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని గుర్తు చేశారు. ఎన్నో కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు ప్రజలు చారి కి రెండు పై ఉండాలని మర్చిపోదని అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకానుచారి జీవిత చరిత్రలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాంత్ చారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమం లో కళాశాల ప్రినిపిసల్ ఆంజనేయులు, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, బిసి విద్యార్థి సంఘం మహిళ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షులు దండవుల తేజ, ప్రధాన కార్యదర్శి పంగ అక్షిత, అధికార ప్రతినిధి పోతూరి అంకిత, కార్యదర్శి దండుగుల అంజలి, భక్తుల అక్షర, బంటు, వర్ష, కోమటి సౌమ్య, విద్యార్థి నాయకులు అర్చన దుంప పరోక్ష విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
