
ముస్తాబాద్ డిసెంబర్ 3 గీతా జయంతి సందర్భంగా పోతుగల్ గ్రామంలో పురాతన శివకేశవ ఆలయంలో భగవద్గీత పూజ మరియు శ్లోకాల పారాయణం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు మాట్లాడుతూ భగవద్గీత అంటే ప్రతి ఒక మానవుడు ఎలా జీవించాలో కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యక్తి యొక్క పూర్తి జీవన విధానాన్ని బోధించే వేదాంత విజ్ఞాన అద్వైత శాస్త్రం భగవద్గీత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఎం ఎస్ జిల్లా కన్వీనర్ తోటధర్మేందర్, తన్నీరు మాధవరావు, ఎరవెల్లి శేఖర్ సుకన్య, ఎరవెల్లి రాణి బిమ్ రావ్, కోండ భానుచందర్, ద్యావతి అంజయ్య గ్రామ భక్తులు పాల్గొన్నారు.
