దౌల్తాబాద్ : రాష్ట్రస్థాయి క్రీడలకు దౌల్తాబాద్ మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్ 19 విభాగంలో శ్రీశైలం 400, 3000 మీటర్లు, వెంకటేష్ 400 మీటర్లు, నర్సింలు 800 మీటర్లు, సంతోష్ 1500 మీటర్ల పరుగు పందెంలో, వెంకటేష్ డిస్కస్ త్రో, సంతోష్ షాట్ పుట్ పోటీల్లో పాల్గొననున్నారు. అండర్ 17 విభాగంలో సందీప్ 100, 200 మీటర్లు, శివ 1500 మీటర్ల పరుగు పందెంకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు హన్మకొండ స్టేడియంలో ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున పాల్గొంటారని పీడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ శోభారాణి, పీఈటీలు డాంబు, బస్వరాజ్ అభినందించారు.
