108ను తనికీ చేసిన ఈ.ఎం.ఈ మహేశ్
అక్టోబర్ 20
మండలకేంద్రంలోని పీహెచ్సీలో గల 108 వాహనాన్ని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఈఎంఈ) ఆకస్మికంగా తనికీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన 108 వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు .
హఠాత్తుగా జరిగే అటువంటి ప్రమాదాలను 108కు ప్రజలు సమాచారం ఇచ్చిన వెంటనే రాత్రి పగలు సేవలు అందుబాటులో ఉంటాయి కావున ప్రజలు 108 యొక్క సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
