ప్రాంతీయం

ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం

26 Views

ఇవి సాధారణ ఎన్నికలు కావు. బీసీ లకు, అగ్రవర్ణ పార్టీలకు జరుగుతున్న యుద్ధం.

ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం.

అగ్రవర్ణ నాయకులను ఓడించి బీసీల ఐక్యతను చాటుదాం.

యువతరానికి పిలుపునిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ.

తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు, అగ్రవర్ణాల నాయకుల పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని మహేష్ వర్మ పేర్కొన్నారు.
అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలకు అండగా ఉండేది కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ
బీసీలు రాజ్యాధికారం సాధించడంలో మూల స్తంభంగా ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న ఉన్నారని స్పష్టం చేశారు.

బీసీలను రిజర్వేషన్స్ పేరిట మోసం చేసిన అగ్రవర్ణ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న 306 గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బహుజనులు పోటీ చేసి, ఒక్క అగ్రవర్ణ నాయకున్ని కూడా గెలవనివ్వకుండా చేయాలని, అగ్రవర్ణ నాయకులను ఓడగొట్టి బీసీల సత్తా చాటాలని కోరారు.ఇది కేవలం ఎన్నికలు కాదు,బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై యుద్ధం. ఈ యుద్ధంలో మనం ఆత్మగౌరవంతో, ఓటు అనే ఆయుధంతో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 306 స్థానాల్లో బీసీల స్థానాలు పోను మిగిలిన జనరల్ 137 సర్పంచ్ స్థానాల్లో మన బీసీ బిడ్డలు పోటీ చేయాలని, ఏ ఒక్క అగ్రవర్ణ నాయకుడు పోటీ చేసినా, వారిని ఓడ గొట్టేందుకు అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న 306 స్థానాల్లో పోటి చేయాలనుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మకు మీ వివరాలు పంపించాలని, అవసరమైతే ఫోన్ చేయాలని తెలిపారు.సర్పంచ్ గా పోటి చేయాలనుకుంటున్న అభ్యర్థులు 8008484689 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
వచ్చేది బీసీల రాజ్యమే అని ఈ యుద్ధంలో అగ్రవర్ణాలను ఓడగొట్టి బీసీ, బహుజనుల ఐక్యతను చాటాలని కోరారు, ఈ ఎన్నికల యుద్ధంతో అగ్రవర్ణ నాయకుల రాజకీయ సమాధులకు పునాది పడనుందని స్పష్టం చేశారు.
ఎక్కడికక్కడ యుద్ధ ప్రతిపాదికన ప్రజలను చైతన్యం చేస్తూ యువతరం కదలాలని పిలుపునిచ్చారు.అగ్రవర్ణ పార్టీలకు నాయకులకు ప్రజలు రాజకీయ సమాధులు కడతారని ముందుగానే గ్రహించి, ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే లక్షల రూపాయలను ఎరగా వేస్తున్నారని అన్నారు. మీ అగ్రవర్ణాల నాయకులకు ఈ ఎన్నికలు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ఆలోచన కూడా రాకుండా చేస్తామని, బీసీల జోలికొస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూపిస్తుందని హెచ్చరించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *