Breaking News

పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి

41 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్.,

వార్షిక తనిఖీల్లో భాగంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ తనిఖీ.

ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు సత్వరమే స్పందించాలని,పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు,ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణ కై రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ సబ్ ఇన్స్ స్పెక్టరు ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీంచారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… నేర పరిశోధన దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి నిందితులకు తప్పనిసరిగా శిక్షపడేందుకు E- సాక్ష్య యాప్ ద్వారా విచారణ, దర్యాప్తు సమయంలో లభించిన భౌతిక సాక్షాలు ను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాక్ష్యం లో అప్లోడ్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు ఇబ్బంది జరగకుండా నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. ఫిర్యాదు వచ్చి వెంటనే స్పందించాలని, ప్రజలకు పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గాటుగానే పోలీసులు. నీజాయితీ తో పనిచేయాలని, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట లకు భంగం కలిగించే విధంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.

చివరగా పోలీస్ కమిషనర్ చేతులమీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.

ఈ తనీఖీలో పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రవణ్ కుమార్, సర్కిల్ ఎస్ఐ లు, సిసి హరీష్ తో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్