తెలంగాణ ఉద్యమంలో తొలి ఆత్మబలిదానం చేసుకున్న స్వర్ణకార బిడ్డ శ్రీకాంతాచారి కి దుబ్బాక పట్టణంలో శనివారం స్వర్ణకార సంఘంలో సభ్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సలీం కు స్వర్ణకార సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షులు ఎస్ ఎన్ చారి మాట్లాడుతూ స్వర్ణకారులు ఆకలితో అలమటిస్తూ శక్తినంత కూడబెట్టి బంగారం వెండి వస్తువులను తయారీలో మేధాశక్తిఉన్న స్వర్ణకార కార్మికులు రేక్కడితే గాని డొక్కానిందని జీవితాలపై కార్పొరేట్ జ్యువెలర్స్ వచ్చి స్వర్ణకారుల పొట్ట కొడుతున్నాయి ఆకలితో అల మతీస్తున్న స్వర్ణకారులను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి స్వర్ణకారులకు ఉపాధి కల్పించాలని సబ్సిడీతో రుణాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
