ప్రాంతీయం

నూతన సంవత్సర వేడుకలకు డీజే లకు అనుమతి లేదు

13 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంది

అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్… ప్రజా రక్షణే లక్ష్యం : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

నూతన సంవత్సర వేడుకలకు డీజే లకు అనుమతి లేదు

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ బి. రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణ లో గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి, రవీందర్ ల ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని 5 ఇంక్లైన్, విటల్ నగర్, తిలక్ నగర్ డౌన్, తిలక్ నగర్, రమేష్ నగర్, చంద్ర శేఖర్ నగర్, సంతోష్ నగర్, ద్వారకా నగర్ ప్రాంతాలలో సీఐ-02,ఎస్ ఐ 12, సిబ్బంది-100 మంది తో ఒకేసారి నేర నియంత్రణ ముందస్తు చర్యలు భాగంగా నాకాబంది నిర్వహించి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీల్లో పెద్దపెల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ లు స్వయంగా పాల్గొని వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్రమ రవాణా,ప్రభుత్వ నిషేధిత పదార్థాలు రవాణా, అనుమానిత వ్యక్తుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి, నేరాలకు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు, అనుమానితులు, దొంగిలించబడిన వస్తువులు, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి, భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు, దొంగతనాలు,చైన్ స్నాచింగ్ లు వంటి ఇతర నేరాలను నివారించేందుకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు మరియు అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్,డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధ్రువ పత్రాలను పరిశీలించారు.డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్,ట్రిపుల్ రైడింగ్,మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వారు, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు కేసులు నమోదు చేసి, 80 ద్విచక్ర వాహనాలు, 06 ఆటో లు, 03 కార్లు లకు జరిమానా విధించి వారికి రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాహనదారుల వివరాలు, వారు వెళ్లే ప్రదేశం వివరాలు, వాహనాలలో ఉన్న వారి వివరాలు తెలుసుకోవడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి సంబంధించి ఈ నాకాబంధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్ని డీసీపీ తెలిపారు.ఈ ప్రక్రియను నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రోజు కూడా నిర్వహించడం జరుగుతుంది అని, 10 గంటల తరువాత స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, నూతన సంవత్సర వేడుకలు వారి వారి కుటుంబ సభ్యులతో ఇంట్లో జరుపుకోవాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది కలిగించే లాగా ప్రవర్తించడం చేస్తే చట్టబడమైన కఠిన చర్యలు తప్పవని యువత తాత్కాలిక ఆనందాల కోసం తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *