ప్రాంతీయం

ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం…

107 Views

ముస్తాబాద్ డిసెంబర్ 3 మండల వనరుల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవంను పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల వికలాంగుల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం అందజేశారు. పెయింటింగ్ లో గెలుపొందిన విద్యార్థులు పి.అరవింద్ జడ్పిహెచ్ఎస్ నామాపూర్ రెండవ బహుమతి జి.దివ్య జెడ్పిహెచ్ఎస్ ఆవునూరు కార్యక్రమం సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులు ప్రతి శుక్రవారం మండలంలో( ఎంఆర్ సి) జరిగే ఫిజియోథెర్ఫ్ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన వికలాంగ విద్యార్థులకు ట్రై సైకిల్ వినికిడి యంత్రాలు కోసం ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఇలాంటి విద్యార్థులను అందరితో సమానంగా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీడీవో రమాదేవి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్, మండల ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్ మనీశ్వరీ, ఎమ్మార్సీ సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, తుమ్మ రాజేందర్ రమాదేవి, సాయి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్