తెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 30
*_దేవురుప్పల మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కి చెందిన వివిధ గ్రామాల నుండి సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక*
_హస్తం గూటికి భారీగా దేవురుప్పల మండల బిఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలందరిని కంటికి రెప్పల కాపాడుకుంటా.. మాజీ సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ కు భారీ షాక్, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్ పర్యటన.
*నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి*
*_అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం,పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ చేరికలు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన గులాబీ శ్రేణులు ఆ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరుతున్నారని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ దేవరుప్పుల పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీకి భారీ షాఖ్ తగిలింది పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 16 గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామస్థాయిలో బిఆర్ఎస్ ముఖ్యనాయకులు, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. పార్లమెంటు ఎన్నికల్లో మరో మారు రైతులను మోసం చేసి లబ్ధి పొందేందుకు కెసిఆర్ దేవరుప్పుల పర్యటన చేస్తున్నాడని ఆరోపించారు. బిఆర్ఎస్ తప్పిదాల వల్ల పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించడం సిగ్గుచేటు అని అన్నారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని, కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలలో పాలుపంచుకుంటు ముందుకు వెళ్తున్నారని, అదేవిదంగా స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశలో నేను పనిచేస్తున్నానని తెలిపారు, పాలకుర్తి నియోజకవర్గం ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న కర్తవ్యం అని, అన్నారు.కొంతమంది కళ్ళులేని కబోదుల విమర్శలు చేస్తున్నారని, వారి విమర్శలను కుట్రలను పట్టించుకోబోమన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యమన్నారు. కష్టపడ్డ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించి లక్ష మెజారిటీని తీసుకో రావడానికి కంకణ బదులు కావాలని పిలుపునిచ్చారు.._
- ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
