ముస్తాబాద్, మే 21 ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల
బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసులో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికై సమర్థవంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని పరిపాలించిన ఘనుడఅన్నారు. యువకులే దేశానికి రాబోయే రోజుల్లో వెన్నుముక అని18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించారఅన్నారు. టెలికాం ఐటి రంగాల్లో నేడు భారతదేశం ఈస్థాయిలో ఉందంటే దానికి బీజం వేసింది రాజీవ్ గాంధీఅని వారు చేసిన విప్లవాత్మకమైన మార్పుల వల్లనే అన్నారు. దేశమే ముందు అంటూ ప్రతి రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన గొప్పవ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు. పట్టణ అధ్యక్షులు, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




