రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.
తొగుట : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పెద్ద మాసన్ పల్లి సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ముదిరాజ్ అన్నారు.గురువారం సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ విక్రయా కేంద్రలొనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసి మష్టి సుమలత కనకయ్య ముదిరాజ్. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి ఉప సర్పంచ్ రాజిరెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ నారాయణరెడ్డి. బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు ఎల్లారెడ్డి. కొల్ల కనకయ్య.రాజయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు
