కవ్వంపల్లికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న ఇతర పార్టీల నాయకులు
మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం సదశివాపల్లిలో గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు..
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మాచర్ల తిరుపతి వారితో పాటు బిఅర్ఎస్ నాయకులు ఏనుగు చొక్కారెడ్డి,ఆకుల దేవదాస్,సాదవేణి మల్లయ్య, సత్తయ్య,పత్తెo తిరుపతి, సింగిరెడ్డి మల్లారెడ్డి,ఏనుగు కోటేశ్వర్ రెడ్డి, జానీమియా,రజాక్,గఫూర్,బండి పర్శరాం,మహేందర్,మాచర్ల సంపత్,సింగిరెడ్డి కొండాల్ రెడ్డి, నాగల్లే నర్సయ్య,తో పాటు మరో 20మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ….
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిసిన సదాశివాపల్లి గ్రామం గత నాలుగు సంవత్సరాల నుండి ఏ మాత్రం అభివృద్ధి కి నోచుకోలేదని గ్రామంలో కనీస సౌకర్యాలు ఐన వీధి దీపాలు, డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేవని మున్సిపల్ లో కలిసినప్పటి నుండి గ్రామాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని అభివృద్ధి గురించి కార్పొరేటర్ నీ అడిగితే మీ ఎమ్మెల్యే నీ అడగాలి అని ఎమ్మెల్యే నీ అడిగితే కార్పొరేటర్ నీ అడగాలనీ చెబుతూ సమస్యలను గాలికి వదిలి వేసారని అన్నారు.కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ధి విలీన గ్రామాల్లో ఎందుకు జరుగడం లేదు దీనికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమాధానం చెప్పాలి అన్నారు..




